శ్రీశైలానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ దర్శనాలు మూడు రోజులు రద్దు..

మన దేశవ్యాప్తం గా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల లో శ్రీశైల పుణ్య క్షేత్రం ఒకటి.

ప్రతి రోజు ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మన  దేశా నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.

ఈ శ్రీశైల పుణ్య క్షేత్రంలో ఈ నెల 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు గర్భాలయ స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం అధికారులు వెల్లడించారు.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల అభిషేకాలు, కుంకుమార్చనలతో పాటు ధర్మాలయా స్పర్శ దర్శనాలు మూడు రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Alert For Devotees Going To Srisailam These Darshans Are Canceled For Three Days

ఇంకా చెప్పాలంటే ఈ నెల 31న శనివారం, జనవరి 1 నూతన సంవత్సరం, రెండవ తేదీ ముక్కోటి ఏకాదశి కూడా ఉండడం వల్ల భక్తులు శ్రీశైలానికి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.భక్తుల రద్దీ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీశైల దేవస్థాన అధికారులు తెలిపారు.ఇంకా చెప్పాలంటే ఈ మూడు రోజులు భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని శ్రీశైల దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకునేందుకు వీలు ఉండేలా అవకాశం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపారు.ముక్కోటి ఏకాదశి రోజు స్వామి అమ్మవార్ల కు రావణ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement
Alert For Devotees Going To Srisailam These Darshans Are Canceled For Three Days

ఆ రోజున సాయంత్రం కన్నుల పండుగ గా గ్రామ ఉత్సవo నిర్వహిస్తామని శ్రీశైల దేవస్థానం అధికారులు వెల్లడించారు.

నిమ్మకాయ పచ్చడిని నిర్ల‌క్ష్యం చేస్తే..ఈ ప్ర‌యోజ‌నాల‌న్నీ కోల్పోతారు!
Advertisement

తాజా వార్తలు