అక్కినేని ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్‌ చేస్తున్న నాగార్జున

అక్కినేని హీరో నాగార్జున బంగార్రాజు సినిమా తో ఈ ఏడాది ఆరంభం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

రికార్డు స్థాయి లో వసూళ్లు దక్కించుకోలేక పోయినా కూడా ఈ ఏడాది మేటి సినిమా ల జాబితాలో మాత్రం చేరింది అనడంలో సందేహం లేదు.ప్రస్తుతం ఆయన హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో ది ఘోస్ట్‌ అనే సినిమా రూపొందుతుంది.

ఆర్మీ కమాండర్ గా నాగార్జున ఆ సినిమా లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తప్పకుండా నాగార్జున ఆ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడు అంటూ అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే నాగార్జున కొత్త సినిమాల విషయం లో అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాడు.

Akkineni Fans Confusion About Nagarjuna Next Movie , Akkineni Fans, Bangarraju,
Advertisement
Akkineni Fans Confusion About Nagarjuna Next Movie , Akkineni Fans, Bangarraju,

నాగార్జున ఎప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ సినిమాలను లైన్ లో పెడతాడు.బంగార్రాజు సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమా ను ఆయన మొదలు పెట్టాలి.కాని ఇప్పటి వరకు ఘోస్ట్‌ సినిమా మాత్రమే ఆయన చేస్తున్నాడు.

కొత్త సినిమాను ఆయన చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.బ్రహ్మాస్త్ర అనే హిందీ సినిమాలో చేస్తున్నప్పటికి దానిపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా లేరు.

కనుక ఈయన వెంటనే తెలుగు లో ఒక సినిమా ను మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఒక వేళ తెలుగు లో సినిమా మొదలు పెట్టకుంటే కచ్చితంగా ఆయన సినిమాల ఎంపిక విషయం లో ఆలోచనతో ఉన్నట్లుగా అనుకోవాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నాగార్జున బిగ్‌ బాస్‌ చేస్తున్నాడు కనుక నాన్‌ స్టాప్ సీజన్ పూర్తి అయ్యాక కొత్త సినిమా షురూ చేసే అవకాశం ఉందంటున్నారు.అందులో నిజం ఎంతుందో చూడాలి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు