మా ఎన్నికలతో మళ్లీ మెగా మంచు వైరం పునః ప్రారంభం ఖాయం!

మా ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది.మంచు విష్ణుకు ఆయన తండ్రి మోహన్‌ బాబు అండగా నిలబడి ఎలాగైనా గెలిపించాలనే పట్టుదలతో ఉన్నాడు.

మంచు విష్ణు మరియు ప్రకాష్‌ రాజ్ లు పోటీ పడుతున్న ఈ ఎన్నికలు రసవత్తరంగా మారడంతో పెద్దలు ఎటు వైపు ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొత్తం 900 మంది మా సభ్యుల్లో ఓట్లు వేసేది కేవలం 400 మందిగా చెబుతూ ఉంటారు.

ఈసారి ఒక వంద మంది ఎక్కువ వేసినా ఆశ్చర్యం లేదు.మొత్తానికి మా ఎన్నికల్లో మెగా సపోర్ట్‌ ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్ కు ఉండటం వల్ల ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు బాలయ్య మరియు ఇతర హీరోలు కూడా మంచు విష్ణు కు మద్దతుగా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈయనే గెలుస్తాడని అంటున్నారు.రెండు ప్యానల్స్ లో కూడా మంచి క్యాండిడేట్స్‌ ఉన్నారు.

Advertisement

కనుక పోటీ రసవత్తరంగా సాగుతోంది.

మంచు విష్ణు కోసం ఇప్పటికే కృష్ణ మరియు కృష్ణం రాజు ఇతరుల వద్దకు వెళ్లిన మోహన్‌ బాబు తన స్నేహితుడు అంటూ చెప్పుకునే చిరంజీవి వద్దకు మాత్రం మోహన్‌ బాబు ఇప్పటి వరకు వెళ్లలేదు.ఇద్దరి మద్య గతంలో విభేదాలు ఉన్నాయి.మద్యలో అవి తొలగి పోయినట్లుగా అనుకున్నారు.

కాని అవి ఇప్పుడు ఇంకా అలాగే ఉన్నాయా లేదా అనేది మా ఎన్నికల తర్వాత తేలిపోయే అవకాశం ఉంది.మా ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతాను అంటూ మోహన్‌ బాబు స్పష్టం చేశాడు.

కనుక ఆ సమయంలో ఖచ్చితంగా ఏదైనా సీరియస్ గా మాట్లాడటం.ఆతర్వాత చిరంజీవి నుండి రియాక్షన్ రావడం జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

కనుక మా ఎన్నికల తర్వాత ఖచ్చితంగా స్నేహితులం అని చెప్పుకుంటున్న ఈ ఇద్దరు స్టార్స్ ఖచ్చితంగా మళ్లీ గొడవలు మొదలు పెట్టడం ఖాయం.ముఖ్యంగా మోహన్ బాబు నుండి విమర్శలు.

Advertisement

గొడవలకు సంబంధించిన కామెంట్స్ వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు