మన హిందూ సాంప్రదాయాల ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్యకు నుదిటిన బొట్టు తీసేయడం ఒక ఆచారంగా వస్తోంది.ఈ క్రమంలోనే కొందరు మహిళలు భర్త చనిపోయిన తర్వాత నుదిటిన బొట్టు పెట్టుకో కూడదని అలా పెట్టుకుంటే మంచిది కాదని పెద్దలు వాదిస్తుంటారు.
నిజంగానే భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు పెట్టుకోకూడదా… శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే.
శాస్త్రం ప్రకారం ఒక బిడ్డ జన్మించినప్పటి నుంచి నుదుటిపై బొట్టు పెట్టుకుంటుంది.
అంటే తనకు వివాహం కాకముందు నుంచి బొట్టు తన నుదిటిపై ఉంది.అయితే వివాహం అయిన తర్వాత భర్త చనిపోతే ఆ మహిళకు నుదిటిన బొట్టు తీసేస్తారు.
ఈ పద్ధతి ఏ శాస్త్రంలోనూ లేదు.మహిళలు పుట్టుకతో వచ్చిన బొట్టును మధ్యలో వచ్చిన భర్త చనిపోతే తీసేయాలని నియమం శాస్త్రంలోనూ లేదు.
అయితే వివాహం తరువాత ఏ క్షణంలో అయితే మహిళ మెడలో మాంగల్యధారణ జరుగుతుందో ఆ సమయంలో తన భర్త మహిళ పాపిడిలో సింధూరం దిద్దుతాడు.అలా పాపిడిలో సింధూరం కేవలం భర్త వచ్చిన తరువాత మాత్రమే మహిళకు దక్కుతుంది.
కనుక భర్త చనిపోయిన తర్వాత మహిళ పాపిడిలో ఉన్న బొట్టును తొలగించాలి కానీ.పుట్టుకతోనే నుదుటిపై పెట్టుకున్న బొట్టును తొలగించకూడదని శాస్త్రం చెబుతోంది.
మాంగల్యం తరువాత మహిళకు వచ్చే ఆభరణాలు నుదుటిపై కుంకుమ, మాంగల్యం, నల్లపూసలు,కాలి మెట్టెలు వంటివి ఒక స్త్రీ జీవితంలోకి భర్త వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆభరణాలు వస్తాయి కనుక ఆ భర్త మరణించిన తర్వాత కేవలం ఈ వస్తువులను మాత్రమే తొలగించాలి కానీ… నుదిటి పై ఉన్న బొట్టును తొలగించకూడదని పండితులు చెబుతున్నారు.అయితే ప్రస్తుత కాలంలో చాలామంది భర్త చనిపోయిన మహిళలు కుంకుమకు దూరమవుతున్నారు.కేవలం నుదుటిపై నలుపురంగు బొట్టును పెట్టుకోవడం మనం చూస్తుంటాము.అదే పూర్వకాలంలో అయితే మహిళల నుదుటిపై ఎటువంటి బొట్టు లేకుండా ఉండేవారు.ఇలా భర్త చనిపోయిన మహిళలు నుదుటిపై బొట్టు పెట్టుకోకూడదన్నది ఏ శాస్త్రంలోనూ లేదని పండితులు తెలియజేస్తున్నారు.
DEVOTIONAL