పారదర్శకంగా టీచర్ల సర్దుబాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 252 మంది సర్దుబాటు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 111, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 39, ప్రాథమిక పాఠశాలలు 330 ఉన్నాయి.

కొన్ని పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది.దీంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 252 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు శనివారం కౌన్సిలింగ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై సర్దుబాటు ప్రక్రియను పరిశీలించారు.అనంతరం ఆయా పాఠశాలల వివరాలు పరిశీలిస్తూ.

ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.

Advertisement

ఆయా పాఠశాలలకు కేటాయించిన ఉపాద్యాయులు విద్యార్ధులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు.ప్రతి విద్యార్థి పోటీ పరీక్షలలో విజయం సాధించేలా శిక్షణ ఇవ్వాలని ఆకాంక్షించారు.

వృత్తి నిబద్ధత పాటిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఈ.

Advertisement

Latest Rajanna Sircilla News