పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. అలాంటి అమ్మాయి అయినా ఓకే?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

మొదట ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన అడవి శేష్ గూడచారి సినిమాతో హీరోగా మారాడు.

అడవి శేషు ఎప్పుడు భిన్నంగా ఉన్న కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు.గూడచారి సినిమాతో హీరోగా మారిన అడవి శేష్ క్షణం, మేజర్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు.

ఇటీవల విడుదలైన మేజర్ సినిమా ద్వారా అడవి శేషు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందాడు.తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వంటి అన్ని భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అడివి శేష్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించాడు.ఈ సినిమాలో అడవి శేష్ నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

Advertisement
Adivi Sesh Shocking Comments About Marriage Details, Adivi Sesh, Tollywood, Maj

ఇదిలా ఉండగా అడవి శేషు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు అడివి శేష్ ఆసక్తికర సమాధానాలను ఇచ్చాడు.

ఈ క్రమంలో విలేకరి మాట్లాడుతూ మీరు అందంగా ఉండటానికి గల రహస్యం ఏమిటి అని అడగ్గా.నేను మందు, పొగ, డ్రగ్స్, నాన్ వెజ్‌ వంటి వాటికి దూరంగా ఉంటా.

సమయానికి నిద్రపోతాను అంటూ చెప్పుకొచ్చాడు.

Adivi Sesh Shocking Comments About Marriage Details, Adivi Sesh, Tollywood, Maj

ఇక ఇంటర్వ్యూలో మరొక ఆసక్తికర విషయం గురించి విలేకరి ప్రశ్నించాడు.మీ పెళ్లి క్యాన్సిల్ అవటానికి కారణం ఏమిటి అని అడగ్గా ఇది చాలా కంప్లికేటెడ్ క్వశ్చన్ అంటూ అడివి శేష్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేశాడు.ఇక ఈ క్రమంలో మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించగా.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అడవి శేషు స్పందిస్తూ.నాకు తెలుగు అమ్మాయితో భారతీయ సంప్రదాయంలోనే వివాహ చేయాలని మా అమ్మానాన్నలు చూస్తున్నారు.

Advertisement

కానీ కానీ ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చిన అమ్మాయి నైనా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ అడవి శేష్ తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి క్లారిటీ ఇచ్చాడు.

తాజా వార్తలు