Adipurush Prabhas : ఆదిపురుష్ ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే గత మూడు రోజుల క్రితం ఈ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కు డైరెక్టర్ ఓం రౌత్ షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే.ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసిన దగ్గర నుండి ట్రోల్స్ బాగా వచ్చాయి.

ఓం రౌత్ అన్ని పాత్రలను మార్చి చూపించిన తీరు చాలా మందికి నచ్చక పోవడంతో ట్రోల్స్ చేసారు.ఈ క్రమంలోనే ఆలోచన పడ్డ ఆదిపురుష్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరింత సమయం తీసుకుని రిలీజ్ చేయాలని భావించి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను జూన్ 16 కు వాయిదా వేశారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిరాశ చెందుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది.

Advertisement

ఈ సినిమా ఇక్కడ మాత్రమే కాదు.ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ అవ్వబోతున్న విషయం విదితమే.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓవర్సీస్ బిజినెస్ గురించి ఒక వార్త తెలుస్తుంది.ఈ సినిమాను ఓవర్సీస్ డిస్టిబ్యూటర్ ఎవరో ఇప్పుడు బయటకు వచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను సరిగమ సినిమాస్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే వీరు పలు భారీ సినిమాలను రిలీజ్ చేసింది.ఇక ఇప్పుడు మరో భారీ సినిమాను రిలీజ్ చేయబోతుంది.

మరి ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి.మరి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.

Advertisement

సీతగా కృతి సనన్ నటిస్తుంది.ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.

లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

తాజా వార్తలు