10 రోజుల్లో ఆదిపురుష్ @450 కోట్లు.. ఇంకా ఎంత రాబట్టాలంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas, ) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్..

( Adipurush ) రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా జూన్ 16న శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మిశ్రమ టాక్ తెచ్చుకుంది.ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

నిన్నటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 10 రోజులు అవుతుంది.మరి ఈ 10 రోజుల్లో ఆదిపురుష్ సినిమా 450 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

మొదటి మూడు రోజుల్లోనే 350 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాత 7 రోజులకు కలిపి కేవలం ఇన్ని కలెక్షన్స్ నే రాబట్టడం ఈ సినిమా గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్ధం అవుతుంది.అయితే ఇన్ని కోట్లు సాధించిన కూడా ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదనే చెప్పాలి.

Advertisement

ఈ సినిమా మొత్తానికే కలెక్షన్స్ పడిపోవడంతో తిరిగి కోలుకోలేక పోతుంది.తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఈ 10 రోజుల్లో 84 కోట్ల షేర్ రాగా ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది.అలాగే బాలీవుడ్ ( Bollywood ) లో ఈ మూవీ 142 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

అప్పట్లో సాహో మూవీ ( Saaho movie ) 155 కోట్లు రాబట్టగా ఇప్పుడు ఆదిపురుష్ ఈ సినిమాను కూడా బీట్ చేస్తుందో లేదో అనే అనుమానం ఉంది.

అందులోనే అక్కడ 1920 అనే హారర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆదిపురుష్ మూవీ మొత్తానికే పడిపోయేట్టుగా కనిపిస్తుంది.మొత్తానికి ఈ సినిమా క్లోజింగ్ దిశగా సాగుతుంది.క్లోజ్ అయితే కానీ ఈ సినిమాకు ఎంత మేర నష్టం వాటిల్లుతుందో తెలుస్తుంది.

ప్రజెంట్ ఈ సినిమా చూడడానికి మేకర్స్ భారీ ఆఫర్స్ ప్రకటించిన ఎడిట్ చేసి ఎన్ని డైలాగ్స్ మార్చిన చూసే నాధుడే లేడు అని చెప్పాలి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు