ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్‎పై ఆదివాసీల దాడి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంపై ఆదివాసీలు దాడికి పాల్పడ్డారు.ఈ క్రమంలో ఆఫీస్ పై రాళ్లు రువ్వారు.

ఆదివాసీల రాళ్ల దాడిలో కార్యాలయం ఎదుట పార్క్ చేసిన పలు ప్రభుత్వ వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.ఈ నేపథ్యంలో తమ హక్కులను కాలరాస్తే ఊరుకోమని నిరసనకారులు హెచ్చరించారు.

Adilabad District Utnoor ITDA Office Attacked By Tribals-ఆదిలాబా�

చట్ట బద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సూచించారు.ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దన్నారు.

అనంతరం గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా ప్రభుత్వం వెంటనే తమకు ఆదివాసీ బంధు ఇవ్వాలని, షరతులు లేకుండా భూహక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు.

Advertisement
జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 

తాజా వార్తలు