నా కెరియర్ లో ఎక్కువ సినిమాలు విజయ్ తోనే చేశాను... త్రిష కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో హీరో విజయ్ (Vijay ) నటించిన తాజా చిత్రం లియో( Leo ) .

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంచలనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది .ఇక ఈ సినిమా సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలందరూ కూడా పాల్గొని సందడి చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష( Trisha ) మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇప్పటివరకు హీరో విజయ్ త్రిష కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే దాదాపు 15 సంవత్సరాలు తర్వాత తిరిగి ఈ జంట ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో త్రిష మాట్లాడుతూ.డైరెక్టర్ లోకేష్ గారు రెండున్నర గంట పాటు కూర్చొని ఈ సినిమా కథ ఎంతో అద్భుతంగా వివరించారు.అయితే ఈయన కథ చెప్పగానే తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని తెలిపారు.

Advertisement

ఆరోజు తాను నాకు ఏ కథ అయితే చెప్పారో తెరపై కూడా అదే చూపించారని త్రిష వెల్లడించారు.

ఇక హీరో విజయ్ గురించి మాట్లాడుతూ తిరిగి 15 సంవత్సరాల తర్వాత విజయ్ గారితో నేను నటించడం చాలా ఆనందంగా ఉందని అప్పుడు మా జంటను ఎలా అయితే ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరించారని త్రిష తన సంతోషం వ్యక్తం చేశారు.ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కలిస్తే వారి ఆనందం ఎలా ఉంటుందో ప్రస్తుతం నా ఆనందం కూడా అలాగే ఉందని ఈమె తెలిపారు.ఇక తన సినీ కెరియర్లో ఎక్కువగా నటించింది హీరో విజయ్ తోనే అని ఈమె తెలియజేశారు.

ఇదివరకు మా సినిమాలు చూసిన వారంతా కూడా తిరిగి విజయ్ తో ఎప్పుడూ నటిస్తున్నారు అంటూ అడిగేవారు ఆ అవకాశం ఇన్ని రోజులకు వచ్చిందని ఈమె తెలిపారు.ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ హీరోయిన్స్ కి కొన్ని సమయాలలో పతనాలు ఉంటాయి.

అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా సంతోషంగా ఉండాలని తెలిపారు.తాను కూడా అలా సంతోషంగా ఉన్నాను కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ త్రిష ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు