రాత్రిపూట రోడ్డుపై స్నానం ఆచరించిన నటుడు.. కారణమేంటంటే..?

నటుడిగా, మోడల్ గా, నిర్మాతగా, ఫిట్ నెస్ ఫ్రీక్ గా మిలింద్ సోమన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.55 సంవత్సరాల వయస్సులో కూడా యాక్టివ్ గా కనిపించే మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

అప్పుడప్పుడూ మిలింద్ సోమన్ ఫన్నీ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు.తాజాగా మిలింద్ సోమన్ ఒక ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ నటుడు రోడ్డుపై కూర్చుని బకెట్ నిండా నీళ్లు నింపుకుని ఆ నీళ్లతో స్నానం చేశారు.

రాత్రిపూట మిలింద్ సోమన్ స్నానం చేయడంతో ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.అయితే మిలింద్ సోమన్ ఈ విధంగా స్నానం చేయడానికి ముఖ్యమైన కారణం ఉందని సమాచారం.

సినిమా షూటింగ్ కొరకు మిలింద్ సోమన్ ఈ విధంగా స్నానం చేశారు.

క్యాప్షన్ లో ఒకవైపు వర్షం పడుతుండగా మరోవైపు వేడినీళ్లతో స్నానం చేశానని ఈ నటుడు చెప్పుకొచ్చారు.చాలామంది తనను పుషప్స్, రన్నింగ్ కాకుండా ఏమైనా చేస్తావా అని అడుగుతున్నారని అలా అడిగే వాళ్లకు ఇదే తన సమాధానమని మిలింద్ సోమన్ తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా వీడియో పోస్ట్ కు 32,000కు పైగా లైక్స్ వచ్చాయి.

బాజీరావ్ మస్తానీ, టర్కీబ్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో మిలింద్ సోమన్ గుర్తింపును సంపాదించుకున్నారు.బాలీవుడ్ సినిమాలతో పాటు పలు సౌత్ ఇండియా సినిమాలలో కూడా మిలింద్ సోమన్ నటించడం గమనార్హం.మిలింద్ సోమన్ పోస్ట్ కు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

తాజా వార్తలు