16 సంవత్సరాలకే ఆ పని చేశానన్న నోరా ఫతేహి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయడం ద్వారా నోరా ఫతేహి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న నటీమణులలో నోరా ఫతేహి ఒకరని చెప్పవచ్చు.తాజాగా ఒక రియాలిటీ షోలో పాల్గొన్న నోరా ఫతేహి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం.16 సంవత్సరాల వయస్సులోనే తాను కెనడాలో వెయిటర్ గా పని చేయాల్సి వచ్చిందని నోరా ఫతేహి అన్నారు.పర్సనల్ రీజన్స్ వల్ల 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వెయిటర్ గా పని చేశానని నోరా ఫతేహి చెప్పుకొచ్చారు.

వెయిటర్ గా పని చేయడం సులువు కాదని ఆమె కామెంట్లు చేశారు.కొంతమంది కస్టమర్లు కొన్ని సందర్భాలలో నీచంగా ప్రవర్తిస్తారని నోరా ఫతేహి కామెంట్లు చేశారు.కస్టమర్లు అలా ప్రవర్తించిన సమయంలో ఆ పరిస్థితులలో ఏ విధంగా ప్రవర్తించాలో అవగాహనను కలిగి ఉండాలని నోరా చెప్పుకొచ్చారు.

భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలో నోరా ఫతేహి చివరిసారిగా నటించారు.ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు నోరా ఫతేహి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఐటమ్ సాంగ్స్ చేయడం ద్వారా హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ బ్యూటీకి ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది.

భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు ఆ సినిమాలో నోరా ముఖ్య పాత్రలో నటించారు.నోరా ఫతేహి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.కెరీర్ విషయంలో నోరా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

తెలుగులో నోరా ఫతేహికి కొన్ని సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు