ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.రాజమండ్రిలో నిర్వహిస్తున్న మహానాడుకు భద్రత కల్పించాలని కోరారు.

కాగా ఈనెల 27, 28 వ తేదీలలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మహానాడుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో విన్నవించారు.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు