రైతుల ప్రాణం తీసిన క్రేన్.. బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. !

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది.

మండలం లోని బల్లూ నాయక్‌ తండాలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో క్రేన్‌ సహాయంతో పూడిక తీస్తుండగా, ప్రమాదవశాత్తు క్రేన్ బకెట్ బావిలో కి ఒరిగి పోయిందట.

దీంతో పాటు క్రేన్ కూడా బావిలోకి ఒరిగి పడిపోయిందట.ఈ క్రమంలో బావి లోతులో ఉన్న రైతుల మీద ఈ బకెట్ పడటంతో బీమా, క్రాంతి అనే ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారట.

మరో ఇద్దరికి గాయాలయ్యాయి.కాగా వారిలో ఇస్లవత్ వెంకన్న అనే రైతు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని సమాచారం.

ఇకపోతే మరణించిన మృత దేహాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్దులు ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారట.

Advertisement

ఇక హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పతి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.మృతులు గిరిజనులు కావడంతో తండా లో విషాద ఛాయలు అలముకున్నాయి.

సుమ బండారం బయటపెట్టిన యాంకర్.... సుమ పరువు మొత్తం పోయిందిగా?
Advertisement

తాజా వార్తలు