యూఏఈ: ఆంక్షల ఎత్తివేత.. క్షణాల్లో అయిపోతున్న ఫ్లైట్ టికెట్లు, భారతీయులకు ఎతిహాద్ శుభవార్త

కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ మేరకు గురువారం (ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక ఈ ప్రకటన రావడంతో ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు.ఇన్నాళ్ల తమ ఎదురుచూపులు ఫలించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

దీంతో యూఏఈ తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడ్డారు.అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా విమానాలు లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు ఇదే అదనుగా విమానయాన సంస్థలు టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయి.ప్రస్తుతం విమాన టికెట్ ధరలు సాధారణ రోజుల్లో కంటే 300 రేట్లు అధికంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

గతంలో ఢిల్లీ-దుబాయ్ వన్‌వే టికెట్ ధర 750-900 దిర్హమ్స్ (ఎకనామీ క్లాస్) ఉండేది.కానీ, ప్రస్తుతం అది 2 వేల దిర్హమ్స్‌కు చేరుకుంది.

ఇదే విధంగా మిగతా తరగతి టికెట్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయ ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది.

ఆగస్టు 7 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 7 నుంచి 9 మధ్య చెన్నై, కొచ్చి, బెంగళూరు, త్రివేండ్రం, న్యూఢిల్లీ నుంచి అబుధాబికి విమాన సర్వీసులు నడుపుతామని ఎతిహాద్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

అలాగే ఆగస్టు 10 నుంచి అహ్మదాబాద్ (ట్రాన్సిట్‌కు మాత్రమే), హైదరాబాద్, ముంబై నుంచి విమాన సర్వీసులు ఉండనున్నాయి.కాగా, భారత్‌తో పాటు మరో పది దేశాల ట్రాన్సిట్ విమానాలకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ట్రాన్సిట్ అనుమతులు పొందిన దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా, ఉగాండా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.కరోనా వల్ల ఆయా దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు ఈ విమానాల ద్వారా తిరిగి యూఏఈ రావొచ్చని పేర్కొంది.

Advertisement

అయితే, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.అలాగే యూఏఈ ప్రయాణానికి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న ప్రయాణికులు కూడా రావొచ్చునని.

ఇలాంటి వారు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చూపించాలని తెలిపింది.ప్రధాన రంగాలైన హెల్త్ వర్కర్స్ (వైద్యులు, నర్సులు, టెక్నిషీయన్స్), టీచింగ్ స్టాఫ్(యూనివర్శిటీ, కళాశాల, పాఠశాల, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు) యూఏఈ తిరిగి రావొచ్చని షనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) వెల్లడించింది.

ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం యూఏఈ రావాలనుకునే ప్రయాణీకులు.ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.టీకా సర్టిఫికేట్‌లతో పాటు ప్రయాణికులు బయల్దేరే 48 గంటల లోపే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి.

అలాగే వారు విమానం ఎక్కేముందు కూడా ల్యాబ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.యూఏఈ చేరుకున్న వెంటనే మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి.హోం క్వారంటైన్‌కు తరలిస్తారు.

తాజా వార్తలు