ఆకాశవీధిలో రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆకాశ వీధుల్లో.ఇక ఇందులో గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ నటీనటులుగా నటించారు.

ఇక తొలిసారిగా హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్నాడు గౌతమ్.ఇక ఈ సినిమాకు మనోజ్ జెడి, డా.డీజే మణికంఠ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.జూడా శాండి ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు.

ఇక ఈ సినిమా ఈరోజు విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే ఇందులో దేవి ప్రసాద్, సంధ్య ల కొడుకుగా గౌతం కృష్ణ కనిపిస్తాడు.ఇక గౌతమ్ కృష్ణ చదువుల వెనుకబడి ఉండటంతో తన తండ్రి చదువుకుంటేనే నీకు విలువ ఇస్తారు అని చెబుతుంటాడు.

కానీ గౌతమ్ తనకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని తన తండ్రితో చెప్పటంతో.ఆ సమయంలో తన తండ్రి గౌతమ్ దగ్గర ఉన్న గిటార్ ను పగలగొడతాడు.

Advertisement
Aakasa Veedhullo Review, Aakasa Veedhullo Rating, Aakasa Veedhullo Review And R

దాంతో గౌతమ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు.ఇక ఆ సమయంలో తనకు పూజిత కనిపివ్వటంతో తనని చూసి ఇష్టపడతాడు.

ఇక తను కాదనటంతో గౌతమ్ డ్రగ్స్ కి అలవాటు పడతాడు.ఇక ఆ సమయంలో తన ఫ్రెండ్స్ గౌతమ్ ను ఇలా ఉంటే ఎలా రాక్ స్టార్ అవుతావు అని మందలిస్తారు.

ఆ తర్వాత గౌతమ్ మళ్లీ మామూలు మనిషి ఎలా అవుతాడు.తన కళ నేరవేర్చుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Aakasa Veedhullo Review, Aakasa Veedhullo Rating, Aakasa Veedhullo Review And R

నటినటుల నటన:

తొలిసారి పరిచయంతోనే గౌతమ్ కృష్ణ తన నటనతో అదరగొట్టాడు.ఇక పూజిత తన లుక్స్ తో ప్రేక్షకులను తన వైపు మలుపుకుంది.ఇక మిగతా నటీనటులు తమ పాత్రలతో అద్భుతంగా మెప్పించారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.దర్శకుడు ఈ తరం ని దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు చూపించాడు.

Advertisement

కథకు తగ్గట్టు సంభాషణలు, కథనం అద్భుతంగా చూపించాడు.జూడా శాండీ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

ఇక సింగర్స్ తమ పాటలతో బాగా ఆకట్టుకున్నారు.సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్ గా మారింది.

ఎడిటింగ్ అద్భుతంగా ఉంది.

విశ్లేషణ:

దర్శకుడిగా, హీరోగా తొలిసారిగా ఈ సినిమాతో పరిచయమైన గౌతమ్ కృష్ణ.దర్శకుడిగా, హీరోగా బాగానే మెప్పించాడు.అంతే కాకుండా ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకొని కథను చూపించాడు.

పైగా మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చాడు.

ప్లస్ పాయింట్స్

: సినిమా కథ, కథనం, నటీనటుల నటన, రొమాంటిక్ సన్నివేశాలు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్.

మైనస్ పాయింట్స్

: అక్కడక్కడ కాస్త సాగదీసినట్లు అనిపించింది.

బాటమ్ లైన్

: ప్రస్తుతం యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తెరకెక్కింది.తొలిసారిగా దర్శకుడిగా, హీరోగా గౌతమ్ అద్భుతంగా చూపించాడు.

ఒక మంచి రొమాంటిక్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కాబట్టి ఈ సినిమాను చూడవచ్చు.

రేటింగ్: 3/5

తాజా వార్తలు