బతికున్న జింక బొచ్చును ఎత్తుకుపోతున్న పిచ్చుకలు.. వీడియో వైరల్!

జంతు ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు ఉంటాయి.ఈ విశేషాలు వైల్డ్‌‌లైఫ్‌‌ ఫోటోగ్రాఫర్ల దయవల్ల మనందరం తెలుసుకోగలుగుతాం.

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత అడవిలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వింతని బయటపెడుతున్నారు.తాజాగా ఒక వ్యక్తి పిచ్చుకలకు, జింకలకు మధ్య జరిగే ఒక ఆసక్తికర విషయాన్ని వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు.

ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో బ్లాక్ కలర్ లో ఉన్న పిచ్చుకలు జింక పై వాలటం చూడొచ్చు.

ఈ పక్షులు పదుల సంఖ్యలో జింక పై వాలి దాని బొచ్చును తీసుకెళ్తున్నాయి.ఈ సమయంలో జింక కదలకుండా సహనంతో ఉంది.

Advertisement
A Sparrow Picking Up A Living Deer Fur Dear, Viral Latest, Viral News, Social Me

అలా అది పక్షులను తన బొచ్చుని తీసుకోనిచ్చింది.పక్షులు జింక వీపుపై తమ కాళ్ళతో గట్టిగా నొక్కుతూ దాని రోమాలను గట్టిగా పీకుతూ కనిపించాయి.

ఈ బొచ్చుతో పక్షులు మంచి గూడును కట్టుకుంటాయి.ఏదేమైనా ఒక బతికున్న జంతువులపై ఎలాంటి భయం లేకుండా పిచ్చుకలు వాడటం భలే ఆశ్చర్యంగా అనిపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

A Sparrow Picking Up A Living Deer Fur Dear, Viral Latest, Viral News, Social Me

ఎర్త్ పిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్, దాదాపు లక్ష వరకు లైక్ లు వచ్చాయి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఈ జింక బొచ్చు వెచ్చగా ఉంటుందని, అందుకే పక్షులు దీంతో గూడుగా కట్టుకునేందుకు బాగా ఇష్టపడతాయని చెబుతున్నారు.

అయితే పిచ్చుకలు ఏ మాత్రం భయం లేకుండా జింక బొచ్చు ఏదో ఫ్రీగా వచ్చినట్లు తీసుకెళ్లడం చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.జింక కూడా ఫ్రీగా హెయిర్ కట్ చేయించుకుంటుందేమో అని మరి కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!
Advertisement

తాజా వార్తలు