ఏపీలో కొత్త డ్రామా నడుస్తోంది..: టీ. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ( Jagga Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.అప్పులు చేసే ప్రధాని వద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అప్పులను డబుల్ చేయడమా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.దేవుడి పేరుతో రాజకీయం చేయొచ్చని బీజేపీని చూస్తే అర్థం అవుతుందని విమర్శించారు.

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి అయ్యే అర్హత రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి మాత్రమే ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అనంతరం ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు.రాళ్లతో కొట్టుకోవడం ఏంటన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాళ్లతో కొట్టుకునే వ్యవస్థ ఉండదని చెప్పారు.

Advertisement

ఏపీలో కొత్త డ్రామా నడుస్తోందన్న ఆయన తెలంగాణ ఇవ్వడం వలనే ఏపీలో స్వయం పాలన వచ్చిందన్నారు.ఏపీలో కూడా కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు