ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన గుర్రం.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి.కొద్ది రోజులుగా అక్కడ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను అల్లాడిపోయేలా చేస్తున్నాయి.

ఇక మూగజీవుల ఈ ఎండకి తట్టుకోలేక అడ్డం పడుతున్నాయి.తాజాగా ఒక గుర్రం ఎర్రటి ఎండలో పరిగెడుతూ అలానే పడిపోయింది.

అమెరికా దేశంలోని న్యూయార్క్ పట్టణంలోని ఐకానిక్ క్యారేజ్ గుర్రాలలో ఒకటిగా ఉన్న ఈ గుర్రం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురైంది.అనంతరం అది రోడ్డుమీదనే ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయింది.

ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు అయ్యో పాపం, ఆ మూగ జీవికి ఏమైందో ఏమో అని దానిని రెస్క్యూ చేయడానికి ముందుకు వచ్చారు.కొందరు స్థానికులు జంతు సంరక్షణ అధికారులకు కాల్ చేశారు.

Advertisement

దాంతో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.అనంతరం పైపులతో దానిపై నీళ్లు పోస్తూ కాస్త ఉపశమనం కలిగించారు.

ఆ చల్లటి నీళ్ళు పోస్తున్నా గుర్రం అప్పటికి నిల్చోలేక పోయింది.వడగాల్పుల వల్ల దానికి వడదెబ్బ తగిలినట్లుంది అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

స్థానికుల ప్రకారం, ఈ గుర్రం కింద పడిపోయినప్పుడు దానిని నడిపే వ్యక్తి కొరడాతో రెండు మూడు సార్లు కొట్టాడట.కానీ పాపం ఆ వేడికి అది తట్టుకోలేక కిందపడిపోయిందని ఆ కఠినాత్ముడు అర్థం చేసుకోలేకపోయాడు.అందుకే అతడిపై జంతు సంరక్షణ అధికారులు ఆగ్రహించారు.

మూగ జంతువులను ఇలా ఎర్రటి ఎండలో పని చేయించడం సరికాదని తిట్టిపోశారు మరో జంతు సంరక్షణ సంస్థ అయిన NYCLASS ఈ ఘటనపై స్పందించింది.ఈ విషయంలో రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ గుర్రం డ్రైవర్‌పై అమెరికా అంతటా విమర్శలు వెల్లువెత్తాయి.దాంతో ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ (TWU) డ్రైవర్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యింది.

Advertisement

ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు