కలవారి కోడలు కనకమహాలక్ష్మి’,ఆగస్టు 5 నుంచి జీ తెలుగులో సరికొత్త ధారావాహిక!

హైదరాబాద్, 31జులై 2024:ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియల్స్ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగేసీరియల్నుఅందించేందుకు సిద్ధమైంది.

నిండునూరేళ్ళసావాసం, జగద్దాత్రి, మాఅన్నయ్య, మేఘసందేశంవంటి సీరియల్స్ ఆరంభం నుంచే అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన కథ, కథనం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’.

నమ్మకద్రోహానికి బలైన ఇద్దరు వ్యక్తుల జీవితమే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ ఆకట్టుకునే కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.తండ్రీకూతుళ్ల బంధం, భార్యాభర్తల అనుబంధం మధ్య ఉద్వేగభరితంగా సాగే సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ఆగస్టు 5న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!కూతురు భవిష్యత్తు కోసం ఆరాటపడే తండ్రి, ఆయన సంతోషం కోసం పాటుపడే కూతురు, తండ్రి కోరికను గౌరవించడం తప్ప మరో కల లేని కనకమహాలక్ష్మి కథే ఈ సీరియల్.

తండ్రి కోరికమేరకు డిగ్రీ పూర్తి చేసిన కనకమహాలక్ష్మి ఓ దుష్టపన్నాగానికి బలైపోతుంది.అదే ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

మరోవైపు బాధ్యతాయుతమైన కొడుకుగా ఉన్న విష్ణు విహారి జీవితం నమ్మకద్రోహానికి బలవుతుంది.విష్ణు విహారిని కలుసుకున్న కనకమహాలక్ష్మి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.

Advertisement

అనూహ్యంగా జరిగే వివాహంతో ఇద్దరి జీవితాలు ముడిపడతాయి.ప్రేమ, పెళ్లి, విధి నడుమ సాగే కథ ఉత్కంఠరేపే మలుపులతో ఆకట్టుకుంటుంది.

విధిని ఎదిరించి కనకం, విష్ణు వారి జీవన ప్రయాణంలోని అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారు? అనేది తెలియాలంటే కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో తెరకెక్కుతున్న కలవారి కోడలు కనకమహాలక్ష్మి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.పాపులర్ నటి ప్రియ ఈ సీరియల్లో ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది.

విష్ణు విహారి పాత్రలో నటిస్తున్నజై ధనుష్ తన నటనతో తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటాడు.‘వైదేహి పరిణయం’ సీరియల్లో వైదేహిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన యుక్తా మల్నాడ్ ఈ సీరియల్లో కనకం పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

కనకమహాలక్ష్మి తండ్రిగా విశ్వమోహన్ నటిస్తున్నారు.మీరూ ఈ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రతిరోజూ మిస్కాకుండా చూసేయండి! కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ ప్రారంభంతో సూర్యకాంతం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30గంటలకు ప్రసారమవుతుంది.ప్రేక్షకులు మార్పును గమనించగలరు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

కూతురిజీవితంనాన్నకల ,నాన్నకలేకనకమహాలక్ష్మికథ- ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’, ఆగస్టు 5న ప్రారంభంసోమవారం – శనివారం వరకుప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ జీ తెలుగులో! .

Advertisement

తాజా వార్తలు