బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ( Vicky Kaushal )హీరోగా నటించిన సినిమా ‘బ్యాడ్ న్యూజ్’.గత కొద్ది రోజులనుండి ఈ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాట ( ‘Tauba Tauba’ song )ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి అందరికీ విధితమే.
ఇక ఈ పాటకు సంబంధించిన హుక్ స్టెప్పులతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే.
, తాజాగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్( Muttiah Muralidharan ) కూడా ఈ పాటకు డాన్స్ వేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోలో చూసిన చాలా మంది స్పిన్ యాంత్రికుడు మురళీధరన్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఇకపోతే వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నది క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కాదు.ఆ వీడియోలో డాన్స్ చేసిన వ్యక్తి పేరు కిరణ్( Kiran ).అతను ఒక కొరియోగ్రాఫర్.కిరణ్ మురళీధరన్ పోలికలు కొంచెం దగ్గరగా ఉండడంతో కొందరు నెటిజెన్లు మురళీధరన్ అని స్ప్రెడ్ చేసినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా కానీ.కిరణ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” బ్యాడ్ న్యూజ్ ” సినిమా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది.పాజిటివ్ టాక్ రావడంతో బాలీవూడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.కేవలం విడుదలైన 12 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో 64 కోట్ల గ్రాస్ సాధించగా, ఓవర్సీస్ లో కూడా ఏకంగా 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దింతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసిందని సినీ వర్గాలు తెలిపాయి.