Friend birthday : ఫ్రెండ్ బర్త్ డే కోసం కేక్ తెచ్చారు.. అసలు విషయం తెలిసి షాక్

స్నేహితుల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకం.ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేని ఎన్నో విషయాలు, సీక్రెట్‌లు, బాధలు తమ స్నేహితులతో పంచుకుంటారు.

రక్త సంబంధం ఉన్న వారు ఆపదలో వదిలేసినప్పుడు స్నేహితులే ఆదుకుంటారు.చాలా మందికి బుడి బుడి నడకలు వేసేటప్పుడు, చిన్నప్పుడు స్కూళ్లలోనూ, కాలేజీలోనూ ఏర్పడిన స్నేహాలను ఎవరూ మర్చిపోలేరు.

వారితో ఆడుకుంటూనే చాలా గొడవలు జరుగుతాయి.మరలా కలిసి పోతారు.

ఇలా స్నేహితుల మధ్య గొడవలు, ఆటపట్టించడాలు చాలా సాధారణమే.ఇటీవల కాలంలో పుట్టిన రోజు వేడుకల్లోనూ, పెళ్లి వేడుకలలోనూ గిఫ్టులు ఇస్తున్నట్లు నటించి, వారిని బకరాలు చేయడం సర్వసాధారణంగా మారింది.

Advertisement

అలాంటి వీడియోలు అందరినీ అలరిస్తున్నాయి.తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తారన హుస్సేన్ అనే ట్విట్టర్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో పోస్ట్ అయింది.అందులో తమ ఫ్రెండ్ పుట్టిన రోజు కావడంతో ఇద్దరు యువకులు ఓ కేక్ తీసుకొస్తారు.

దానిని చాలా అందంగా తయారు చేయించారు.దానిని ఓపెన్ చేసి బైక్‌ పైన పెడతారు.

ఆ కేక్ కట్ చేయాలని బర్త్ డే జరుపుకుంటున్న తమ ఫ్రెండ్‌ను పిలుస్తారు.బర్త్ డే జరుపుకుంటున్న ఆ యువకుడు వచ్చి తన ఫ్రెండ్స్ తెచ్చిన కేక్ చూసి మురిసి పోతాడు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

చాలా అందంగా కేక్ తయారు చేయించారని సంతోషించాడు.ఫ్రెండ్స్ ఇచ్చిన చాకు తీసుకుని దానిని కట్ చేయాలని ముందుకు వస్తాడు.

Advertisement

చాకు తీసుకుని ఆ కేక్ కట్ చేస్తుండగా ఆ చాకు లోపలికి పోవడం లేదని గ్రహిస్తాడు.దీంతో ఆశ్చర్యపోతాడు.

అసలు అది నిజంగా కేక్ లేదా ఇందకేదైనానా అని అనుమానం వస్తుంది.దీంతో ఆ కేక్ తిప్పి చూస్తాడు.

అది అల్యూమినియం గిన్నె అని, దానిపై కేక్ రూపంలో క్రీమ్ రాశారని అర్ధం అవుతుంది.దీంతో పుట్టిన రోజు నాడు తనను బకరా చేసిన తన ఫ్రెండ్స్‌ను కొట్టడానికి వెళ్తాడు.

ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

తాజా వార్తలు