కన్నతల్లిని చంపడానికి కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చిన 14 ఏళ్ల బాలిక..!

ఇటీవల కాలంలో ప్రేమ మోజులో పడి కుటుంబ సభ్యుల పైనే దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు మూర్ఖులు.

కనీసం తల్లిదండ్రులు అనే కనికరం లేకుండా కేవలం తమ స్వార్థం కోసం చంపడానికైనా వెనుకాడడం లేదు.

ఓ 14 ఏళ్ల యువతి తన ప్రేమకు తల్లి అడ్డు చెప్పడంతో ఏకంగా కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చి హత్య చేయించింది.రష్యాలోని మాస్కో( Moscow, Russia )లో ఓ 14 ఏళ్ల యువతి, 15 ఏళ్ల బాలుడిని ప్రేమించింది.

ఈ విషయం యువతి తల్లికి తెలియడంతో, బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని గట్టిగా నిలదీసింది.తల్లి ఎన్నిసార్లు చెప్పినా యువతి మాత్రం తన ప్రవర్తనను మార్చుకోలేదు.

పైగా తన ప్రేమకు తల్లి ( mother )అడ్డుగా ఉంటుందని నిర్ణయించుకున్న యువతి, తన ప్రియుడితో సహా కన్నతల్లిని చంపేందుకు కిరాయి గూండాలను ఫర్మాయించింది.

A 14 Year Old Girl Gave Supari To Hired Goons To Kill Her Mother ,moscow, Russia
Advertisement
A 14 Year Old Girl Gave Supari To Hired Goons To Kill Her Mother ,Moscow, Russia

కిరాయి గుండాలు ఆ యువతి తల్లిని దారుణంగా కొట్టి, గొంతు కోసి మృతుదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి మాస్కో సమీప ప్రాంతంలో పడేశారు.మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అనస్తాసియా( Anastasia ) గా గుర్తించి, ఈమె కుమార్తెను ప్రాథమిక విచారణ చేస్తే అసలు నిజాలు బయటకు వచ్చాయి.

తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉండడంతో ప్రియుడుతో కలిసి తల్లిని హత్య చేసేందుకు కిరాయి గుండాలకు భారత కరెన్సీలో 3,72,202 రూపాయలు ఇచ్చినట్లు అంగీకరించింది.

A 14 Year Old Girl Gave Supari To Hired Goons To Kill Her Mother ,moscow, Russia

ఇద్దరు మైనర్లు( minors ) కలిసి కిరాయి గుండాలతో 38 ఏళ్ల అనస్తాసియా ను దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది.ఆ యువకుడితో పాటు ఆ యువతిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.ప్రేమ కోసం కన్నతల్లినే హత్య చేసిన సంఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.

ప్రేమ మోజూలో పడి చివరకు కటకటాల పాలు అయింది.

ఆ బ్యానర్ లో పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి మూవీ.. ఛార్మీ వార్తల్లో నిజం లేనట్టేగా!
Advertisement

తాజా వార్తలు