వడగండ్ల వాన తో నష్టపోయిన వరి పంట పొలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి.

ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు సేవాలల్ తండా, గాన్నేవాని పల్లె, ఆవునూరు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేన్లు కోతకు వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షాలు పడడం నిజంగా బాధాకరమన్నారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకునే బాధ్యత మాది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్,పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, పోతుగల్ , మోర్రయిపల్లే ,గాన్నేవాని పల్లె , సేవలల్ తండా గ్రామ శాఖ అధ్యక్షులు అనమెని రాజు కుమార్,మల్లేష్, మున్నా నాయక్, తెర్లుమర్ది మాజీ సర్పంచ్ కిషన్ రావు,అంజన్ రావు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంజాన్ నరేష్, కణమెని శ్రీనివాస్, కేసుగాని చంద్రమౌళి,తోట ధర్మేంద్ర,నల్ల చారి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి - జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
Advertisement

Latest Rajanna Sircilla News