ఇప్పటికీ ఋషులు తిరిగాడే వృక్షం.. మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా..?

దేవాలయ ప్రాంగణంలో ఒక చెట్టుపై ఋషులు ఇప్పటికీ సంచరిస్తారు.ఆ మహర్షులు జీవుల రూపంలో సంచరిస్తారు.

 Do You Know Which State Of Our Country Is The Tree Where The Sages Still Roam..?-TeluguStop.com

వారు అందరికీ కనిపించరు.ఆ జీవులు కనిపించిన వాటి పేరు మాత్రం పైకి చెప్పకూడదు.

అది అక్కడి నియమం.ఆ చెట్టు భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం లో ఉంది.

అయితే అక్కడ ఈ తప్పు అసలు చేయకూడదు.చెట్టుపై మనకు జీవులు కనిపిస్తాయి.

చెట్టు కొమ్మల్లో అవి కలిసిపోయి ఉంటాయి.అలా ఏదైనా జీవి రూపం కనిపించిన పేరు పెట్టి మాత్రం పైకి చెప్పకూడదు.

Telugu Bhakti, Devotional, Lord Shiva, Pidarikali, Pournami, Sages, Tamil Nadu-L

పౌర్ణమి రోజు( Pournami )న కొన్ని లక్షల మంది వచ్చే క్షేత్రంలో ఆ చెట్టు విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల దివ్య క్షేత్రం( Arunachalam ) ఉంది.పంచభూత లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి.ఇక్కడ పరమేశ్వరుడిని అరుణాచలేశ్వరునిగా కొలుస్తారు.దేశ విదేశాల నుంచి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు అరుణాచల క్షేత్రాన్ని దర్శించి భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షణ పూర్తి చేస్తారు.ఈ దేవాలయంలో ఎన్నో రహస్యాలు, విశేషాలు, మరెన్నో వింతలు దాగి ఉన్నాయి.

ఇప్పటికీ అక్కడ సిద్దులు అనేక రూపాలలో ఉన్నారని వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని వేద పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Lord Shiva, Pidarikali, Pournami, Sages, Tamil Nadu-L

అరుణాచలేశ్వరుని ప్రధాన ఆలయంలో నాలుగు ప్రదేశాల్లో ఇప్పటికీ ఉన్నారని చెబుతారు.అందులో ఒక ప్రదేశమే ఈ మహిమాన్విత వృక్షం.కిలి గోపురం దాటగానే కుడివైపున దేవాలయ ఈశాన్య భాగంలో పంచభూత లింగాల దేవాలయాలు ఉంటాయి.

అక్కడే బిడారి అమ్మన్( Pidari Kali Amman Temple ) దేవాలయం ఉంది.ఈ దేవాలయానికి ఎదురుగా ఒక వృక్షం ఉంది.అది చూడడానికి ఒకే వృక్షంగా ఉన్న అందులో రావి చెట్టు, మారేడు చెట్టు రెండూ ఒకదానితో ఒకటి కలిసి ఒకే వృక్షంగా కనబడుతూ ఉంటుంది.ఒక చెట్టు లోపల నుంచి మరొక చెట్టు పెరగడం ఎంతో విచిత్రం.

ఇలాంటి దృశ్యం ఎక్కడా చూడలేము.చెట్టుపై కొన్ని రకాల జీవులు కనిపించిన అక్కడ ఎవరూ పేరుతో వాటిని పిలువరు.

సాధారణంగా ఆ జీవులు చెట్టు రంగులు కలిసిపోయి ఎవరికి కనిపించవు.ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ జీవులు కనిపించవు.

అక్కడున్న సప్త ఋషులు జీవుల రూపంలో ఆ వృక్షంపై ఉన్నారని భక్తులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube