ఏకాదశి రోజు ఈ తప్పులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.పురాణాలు శాస్త్రాల్లో ఏకాదశి ఉపవాసానికి సంబంధించి అనేక వివరణలు, సూచనలు ఉన్నాయి.
మనం చేసే పాపాలన్నీ ఏకాదశి రోజున మనం తినే ఆహారం పై ఉంటాయని పండితులు చెబుతున్నారు.అందుకే ఉపవాసం చేయాలని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులు కలిపి ఏకాదశి వ్రతం చేయాలి.
ఇంకా చెప్పాలంటే దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి.
నేల మీద పడుకోవాలి.ఏకాదశి తెల్లవారుజామునే నిద్రలేవాలి.
ఉదయాన్నే స్నానమాచరించి పూజ మందిరంలో సంకల్ప శ్లోకం చదవాలి అని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఆరోగ్యవంతులు మాత్రమే ఉపవాసం చేయాలి.అలాగే ఏకాదశి రోజు చేయాల్సిన దానాలు, నియమాలు చేయకూడని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఏకాదశి ఉపవాసం( Fasting ) రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని ఉల్లంఘించకూడదు.
ఎల్లవేళలా దీనిని ఆచరించాలి.ముఖ్యంగా చెప్పాలంటే మాంసం, మద్యనికి దూరంగా ఉండటమే ఎంతో మంచిది.
చెడు మాట్లాడకూడదు.చెడు వినకూడదు.
చెడు చేయకూడదు.దూషణలు, వాదనలు, అస్సలు చేయకూడదు.
దశమి రాత్రి నుంచి బ్రహ్మచర్యం పాటించాలని పండితులు చెబుతున్నారు.అలాగే నిర్జల ఏకాదశి రోజు ( Nirjala Ekadashi )నల్లని వస్తువులను ధరించకూడదు.

దశమి రోజు అన్నంతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు.అలాగే ఉపవాసం పాటించిన వారు మీరు కూడా తాగకూడదు.అలాగే పసుపు రంగు బట్టలు ధరించి విష్ణువును పూజించడం మొదలుపెట్టాలి.ముందుగా పసుపు వస్త్రాన్ని పరిచి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి, శ్రీమహావిష్ణువు( Mahavishnu ) చిత్రాన్ని ఉంచి ఆపై పసుపుతో తిలకం దిద్దాలి.
శ్రీహరికి పసుపు పువ్వులు, పసుపు పండ్లు, స్వీట్లను సమర్పించాలి.పూజా సమయంలో ఏకాదశి వృత్తాంతాన్ని పాటించి హారతి చేసి పూజను పూర్తి చేయాలి.
ఈ ఏకాదశి రోజున మీ సామర్థ్యాన్ని బట్టి పేదవారికి దానం చేయడం మంచిదని ఈ పనులు చెబుతున్నారు.ఆకలి అన్నవారికి అన్నదానం చేస్తే ఆర్థిక లాభం( Financial gain ) కలుగుతుంది.
నీటిని దానం చేయడం వలన పితృ దోషం నుంచి బయటపడవచ్చు.