జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం నవగ్రహాలకు అధిపతి సూర్యదేవుడు.ప్రత్యక్ష దైవం అయినా సూర్యుడికి ప్రతి రోజు ఉదయం చాలామంది ప్రజలు అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు.
ఇలా చేయడం వలన పుణ్యం లభించి ఆరోగ్యంగా ఉంటారని చాలామంది ప్రజల నమ్మకం.శనీశ్వరుడు ( Saturn )రవి కలిసినప్పుడు రవి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.
ఈ రవి యోగం శుభ యోగంగా పరిగణిస్తారు.ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఏప్రిల్ 30వ తేదీ సూర్యోదయం వరకు ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ యోగం శక్తితో నిండి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఈరోజున వ్యక్తి ఏ పని చేసినా అది విజయవంతం అయ్యే అవకాశం ఉందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఈ నేపథ్యంలో ఈ రోజున శని సూర్య దోషం( Shani Surya dosham ) వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఈ ప్రత్యేక పరిహారం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.రవి యోగంలో సూర్యభగవానుడి ప్రభావం బలంగా ఉంటుంది.
అందు వల్ల ఈ రవి యోగంలో మీరు ఏ పని చేసినా అది విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ యోగంలో చేస్తున్న పనిలో ఆటంకాలు ఏర్పడవు.

జ్యోతిష శాస్త్రం ప్రకారం రవి యోగం ఏప్రిల్ 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల నుంచి ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది.ఈరోజు శుభ సమయం ఉదయం 11 గంటల 12 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.04 వరకు ఉంటుంది.ఈ శుభ సమయంలో ఎవరు ఏ పని మొదలుపెట్టిన ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండవు.
రవి యోగంలో సూర్యభగవానుడికి ఎర్రచందనం, బెల్లం, ఎర్రని పువ్వులు( Red sandalwood, jaggery, red flowers ) సమర్పించాలి.ఈ సమయంలో సూర్య మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సూర్య దోషం దూరం అయిపోతుంది.అలాగే శనివారం రోజు శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులు, గోధుమలు దానం చేయాలి.
శని దేవుడికి నల్ల నువ్వులు, సూర్యదేవుడికి గోధుమలు అంటే ఎంతో ఇష్టం.ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సూర్య దోషాలు, శని దోషాలు దూరం అయిపోతాయి.







