హిందూమతంలో దేవుని ఆరాధనకు ఎన్నో రకాల నియమాలు ఉన్నాయి.భగవంతుని పూజించేటప్పుడు మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం.
ఈ తప్పులు మనల్ని పూజ ఫలితాలను పొందకుండా చేస్తుంటాయి.కాబట్టి భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పూజ చేసేటప్పుడు కూర్చునే దిక్కు కూడా ఎంతో ముఖ్యమైనది.పూజ చేసేటప్పుడు ఏ దిశలో కూర్చొని పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా పూజ చేసేటప్పుడు కూర్చునే దిశా విధానం చాలా ముఖ్యమైనది.పూజకు కాళ్లు ముడుచుకుని కింద కూర్చోవాలి.
దేవుని విగ్రహం లేదా ఫోటో ముందు కాళ్లు చాచీ అసలు కూర్చోకూడదు.మనం దేవుని పూజించేటప్పుడు మనం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి.
ముఖ్యంగా ఉత్తరం, తూర్పు మధ్య ఏది మంచిదో మీరు నిర్ణయించుకుంటే భగవంతుని పూజకు తూర్పు దిశ ఎంతో మంచిది.
తూర్పు దిశలో( East direction ) కూర్చొని స్వామిని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
ఎందుకంటే తూర్పు దిక్కు బలం, ధైర్యానికి చిహ్నం గా వేద పండితులు చెబుతున్నారు.వాస్తు శాస్త్రంలో పూజ కోసం తూర్పు దిశలో కూర్చోవడం, జ్ఞానాన్ని పొందడానికి పడమర వైపు తిరగడం మంచిది.
ఈ దిశలో పూజించడం వల్ల మనలో శక్తి, కమ్యూనికేషన్ పెరుగుతుంది.ఈ దిశలో పూజ స్థలం ఉన్న ఇళ్లలో నివసించే వ్యక్తులు శాంతి, ప్రశాంతత, సంపద, ఆనందం, ఆరోగ్యాన్ని అనుభవిస్తారు.
ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో పూజా స్థలాన్ని నిర్మించే ముందు మీరు నిపుణులైన పండితుల లేదా వాస్తు నిపుణుల సలహా తీసుకొని పూజగది స్థలాన్ని ఎంచుకోవాలి.ఇంట్లో పూజ గది( Pooja room ) ఎప్పుడు ఈశాన్య దిశలో ఉండడం శుభప్రదంగా భావిస్తారు.అదే సమయంలో ఇంటి లోపల దేవుడి గదికి విశాలమైన స్థలం ఉండడం మంచిది.ఇంటి లోపల పూజా గృహాన్ని నిర్మించినప్పుడు పూజగదికి దిగువన లేదా పైన లేదా పక్కన మరుగుదొడ్డి అసలు ఉండకూడదు.