వరి పొలాల్లో శ్రమను, పెట్టుబడిని తగ్గించే పనిముట్లు ఇవే..!

వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అభివృద్ధికి చెందిన క్రమంలో చాలా రకాల పనిముట్లు వచ్చి కూలీల శ్రమను చాలావరకు తగ్గించాయి.వరి పంట సాగుకు కావలసిన పనిముట్లు ఏమిటో చూద్దాం.

 These Are The Tools That Reduce Labor And Investment In Paddy Fields , Paddy Fie-TeluguStop.com

1.

ఎ.పి.ఎ.యు పడ్లరు

: ఎద్దులతో వ్యవసాయం చేసే రైతుల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది.పొలంలో వరి నారు నాటిన తర్వాత ఐదు నుండి పది సెంటీమీటర్ల వరకు నీరు నిల్వ ఉంటే మంచిది.

ఇలా నీరు నిల్వ( Water storage ) ఉండాలంటే భూమిని వరి దమ్ము చేయాలి.వరిదమ్ము చేయడానికి ఈ ఎ.పి.ఎ.యు పడ్లర్ తో దమ్ము చేయడం వల్ల నేల అడుగు భాగంలో ఓ గట్టి మట్టి పొర ఏర్పడి నీరు లోపలి పొరలకు పోకుండా ప్రధాన పొలంలో నిల్వ ఉంటుంది.

2.

రోటోవేటర్

: ట్రాక్టర్ సహాయంతో రోటోవేటర్( Rotovator ) ను పొలంలో నెమ్మదిగా తిప్పడం వల్ల భూమి లోపల ఉండే మట్టి గడ్డలు కరిగిపోయి, వరి నాట్లకు కావలసిన దమ్ము నాణ్యత పెరుగుతుంది.లోపల ఒక పొరలాగా ఏర్పడి నీరు భూమిలోకి ఇంకిపోకుండా పొలం అంతా ఒకే మోతాదులో నీరు నిల్వ ఉంటుంది.

3.

ఎ.వరి డ్రమ్ సీడరు

: ఈ యంత్రం సహాయంతో ఎనిమిది వరస సాళ్ల మధ్య వరి విత్తనాలు నాటవచ్చు.ముందుగా విత్తనాలను ఓ 24 గంటలు నానబెట్టి, ఓ 12 గంటలు మండే కట్టి, గింజల నుండి మొలక ఆరంభ దశలో ఈ యంత్రానికి అమర్చిన నాలుగు డబ్బాలలో నింపాలి.

ఈ యంత్రం లోని రంద్రం నుండి విత్తనాలు( seeds ) వరుసగా నేలలో పడతాయి.ఈ వరుసలు పాడు కాకుండా ఒక వారం రోజులపాటు పొలంలో తేలిక నీరు ఉండేటట్లు చూసుకోవాలి.

4.

బి.వరి నాటే యంత్రాలు

: ఈ పద్ధతిలో వరి నాటడం కోసం ప్లాస్టిక్ ట్రే( Plastic tray )లు అవసరం.ఒక ఎకరానికి 80 ట్రేలు కావాల్సి ఉంటుంది.

ఈ ట్రేలను పొలంలోని ఓ భాగంలో ఉంచి 15 నుండి 25 రోజుల వరకు నారు పెంచి, పొలాన్ని బాగా దమ్ము చేసిన తర్వాత చదును చేసి పొలాన్ని ఆరబెట్టాలి.నాటేముందు తేలికపాటి మీరు పెట్టి, ఈ యంత్రం సహాయంతో నాటుకుంటే కూలీల ఖర్చు దాదాపుగా 45% తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube