మనదేశంలో ప్రజలందరూ ప్రతి పండుగను ఎంతో ఘనంగా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకుంటారు.దాదాపు అన్ని పండుగలకు వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా వారి సొంత ఊర్లకు వచ్చి పండుగను ఎంతో సంతోషంగా జరుపుతారు.
అలాగే దీపావళి పండుగ కూడా మన దేశంలోని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.దీపావళి పండుగను లక్ష్మీదేవి పుట్టినరోజు పండితులు భావిస్తారు.
ఈ పండుగ సందర్భంగా ఆమెకు పూజలు చేస్తారు.దీపావళిని వరుసగా 5 రోజులపాటు జరుపుకుంటారు.
ఈ పండుగ కోసం కొన్ని రోజుల ముందే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు.
దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని చాలామంది ప్రజలు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు.
సాధారణంగా కొన్ని పండుగలను వివిధ ప్రాంతాలను బట్టి, వివిధ పేర్లతో నిర్వహించుకుంటారు.కానీ, దీపావళి పండుగను మాత్రమే ఒక్క పేరుతో మాత్రమే జరుపుకుంటారు.ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళిని జరుపుకుంటారు.అదేవిధంగా ఈ సంవత్సరం అక్టోబర్ 25 వ తారీఖున దీపావళి జరుపుకుంటారు.
నరకాసురుడి వధకు గుర్తుగా ఈ దీపావళిని నరకాసుర చతుర్ధశి అంటారు.
ఈ కారణంగా ఉత్తర భారతదేశంలో చతుర్ధశి తిథి రోజున దీపావళి నిర్వహించుకుంటారు.
ఇది చతుర్ధశి తథి, అమావాస్య రోజుతో సమానం.ఇతర పండుగల సమయంలో ఉపవాసాల రోజులుగా లాగానే దీపావళి ఉపవాసం నుంచి శ్రీకృష్ణుడిని స్మరించుకోవడానికి, కుబేరులను పూజించుకోవడానికి ఇది మంచి సమయం.
అంతేకాదు దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేయకుండా ఉండటం ఆ ఇంటికి మంచి జరిగే అవకాశం ఉంది.మొదటి రోజు ఇంటిని శుభ్రం చేసి ఉంచడం మంచిది.దీపావళి రోజు ఉదయాన్నే లేచి నూనె పెట్టుకుని స్నానం చేయాలి.దీనికి శుభ సమయం తెల్లవారుజాము 3 గంటల నుంచి 5.30 గంటల మధ్య నూనె స్నానం చేయడం మంచిది.అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా నిరుపేదలకు అన్నదానం, మిఠాయిలు దానం చేస్తే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
LATEST NEWS - TELUGU