ఏపీలో ఎన్నికలకు షెడ్యూల్( AP Elections Schedule ) విడుదల కావడంతో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఇందులో భాగంగా ఇవాళ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM YS Jagan ) కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం( Tadepalli Camp Office )లో ఈ భేటీ జరగనుంది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పార్టీ నేతలతో సీఎం జగన్ చర్చించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులు, మ్యానిఫెస్టోపై సీఎం జగన్ చర్చించనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆయన సమాలోచనలు చేయనున్నారు.