CM YS Jagan : వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ.. ఎన్నికల వ్యూహాంపై చర్చ
TeluguStop.com
ఏపీలో ఎన్నికలకు షెడ్యూల్( AP Elections Schedule ) విడుదల కావడంతో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ఇవాళ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM YS Jagan ) కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం( Tadepalli Camp Office )లో ఈ భేటీ జరగనుంది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పార్టీ నేతలతో సీఎం జగన్ చర్చించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులు, మ్యానిఫెస్టోపై సీఎం జగన్ చర్చించనున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆయన సమాలోచనలు చేయనున్నారు.