ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం 06.09
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.7.41 ల.8.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన ఈరోజు అంతా శుభమే జరుగుతుంది.కొన్ని చెడు సమాసాలకు దూరంగా ఉండటమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
వృషభం:
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం:
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
కర్కాటకం:
ఈరోజు మీరు చేసే పనిలో అలసట ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
సింహం:
ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువులు ఇంటికి వెళ్తారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు రాజకీయ నాయకులు వారిపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
తులా:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
ధనస్సు:
ఈరోజు మీరు చేసే ప్రయాణంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తోటి వారి సహాయం నీకు ఎప్పుడు ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మకరం:
ఈరోజు మీరు ఎప్పటి నుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు బయటపడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.అనవసరంగా ఇతరుల విషయంలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
కుంభం:
ఈరోజుమీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
మీనం:
ఈరోజు వ్యాపారస్తులు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
DEVOTIONAL