ఆ సూపర్ హిట్ రీమేక్ లో నాగార్జున.. ఇదైనా కలిసొచ్చేనా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికి కూడా అదే అందం, ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ప్రేక్షకుల చేత మన్మధుడు అని పిలుపించు కుంటున్నాడు.నాగార్జున గత కొన్నేళ్ల నుండే మల్టీ స్టారర్ సినిమాలు చేయడం స్టార్ట్ చేసాడు.

 Nagarjuna To Do Malayalam Remake, Prasanna Kumar, Nagarjuna, Malayalam Remake, P-TeluguStop.com

నాగార్జున ఇటు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే వేరే హీరోతో స్క్రీన్ పంచుకోవడానికి కూడా ఎప్పుడు రెడీగానే ఉంటాడు.

ఐదు పదుల వయసు దాటేసిన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు.

ఇక గత ఏడాది నాగార్జున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ముందుగా 2022 సంక్రాంతి కానుకగా కొడుకు నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాతో రాగా ఇది మంచి హిట్ సొంతం చేసుకుంది.

అయితే ఆ తర్వాత వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమాతో సోలోగా వచ్చి ఘోరంగా విఫలం అయ్యాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం అందుకోలేక పోయింది.కలెక్షన్స్ పరంగా అయితే ఘోరంగా విఫలం అయ్యింది అనే చెప్పాలి.ఇక నాగార్జున ఈ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా నాగ్ ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమా విషయంలో ప్రసన్న కుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడు అని టాక్.

కాగా తాజాగా ఈ సినిమా విషయంలో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ కు రీమేక్ అని టాక్.మలయాళంలో సూపర్ హిట్ అయిన పెరింజు మరియుమ్ జొస్ సినిమాకు అఫిషియల్ రీమేక్ అని తెలుస్తుంది.ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప్రసన్న కుమార్ మార్పులు చేస్తున్నారట.

ఈ సినిమాను అతి త్వరలోనే అఫిషియల్ గా ప్రకటిస్తారని టాక్.అలాగే ఈ సినిమాలో ఇద్దరు యంగ్ టాలీవుడ్ హీరోలు కూడా నటించ బోతున్నారట.

మరి ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube