రాజకీయ నాయకుల ప్రవర్తన ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది.ప్రముఖ రాజకీయ నాయకుల వారసుల విషయం లో చేతులెత్తి మొక్కి తమ స్వామీ భక్తి ని చాటుకునే వారు ఎందఱో.
తెలంగణా రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర పరిణామ ఎదురు అవుతోంది.ఖైరతా బాద్ టైగర్ గా పేరొందిన పీ జే ఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి కెసిఆర్ మనవడు హిమాంసు ని పూల మాలతో సత్కరించారు .కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ కు దూరమయ్యారు.
ఆయన సోదరి టీఆరెస్ లో చేరినా విష్ణు మాత్రం టీఆరెస్ లో లేరు.
మంగళవారం తన పుట్టిన రోజు జరుపుకున్న కేసీఆర్ మనవడు – కేటీఆర్ కుమారుడు హిమాంశు జూబ్లీ హిల్సు పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయగా అక్కడకు వచ్చిన విష్ణు.హిమాంశు మెడలో పూల మాల వేసి సత్కరించారు.
హిమాంశు జన్మదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ఆయన కుటుంబసభ్యులు పూజలు చేశారు.ఆ సందర్భంగా ఆ పన్నెండేళ్ల ప్రముఖుడిని విష్ణు సత్కరించడం అందరినీ ఆకట్టుకుంది.







