అడవిలో ఉండాల్సిన సింహాలు రోడ్డు ఎక్కితే ? ఇదేదో తెలుగు సినిమా హీరో చెప్పే డైలాగ్ కాదు .సాక్షాత్తూ ఇది నిజంగా గుజరాత్ రోడ్ల మీద జరిగిన ఉదంతం.
గుజరాత్ లోని జూనా గడ్ అనే ప్రాంత ప్రజలకి గతరాత్రి చుక్కలు కనపడ్డాయి.ఒక్క సారిగా రోడ్డు మీదకి సింహాలు రావడం , ఊరంతా తిరగడం, మెయిన్ రోడ్స్ మీద తిరగడం జరిగింది.
వీటిని చూసిన కొన్ని ఔత్సాహికులు వీడియో తీసి పట్టుకొచ్చి మీడియా లో పెట్టారు.సింహాలు దర్జాగా రోడ్డుపై నడిచి వెళుతుంటే ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఈ సింహాల్లో రెండు కూనలు కూడా ఉన్నాయి.జునాగఢ్ పట్టణం అమ్రేలీ జిల్లాలో ఉంది.
భారతదేశంలో ప్రముఖ సింహాల స్థావరమైన గిర్ అడవులు అభయారణ్యం ఉన్నది కూడా అమ్రేలీ జిల్లాలోనే.జునాగఢ్లోని శివారు ప్రాంతంలో నిర్మానుష్యమైన చోట ఇలా ఎనిమిది సింహాలు ఒకేసారి కనిపించడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
వీటిని సమీపం నుంచి చూసినవారంతా తలో దిక్కు పారిపోగా కొందరు మాత్రం చాటుమాటుగా కెమేరాలు క్లిక్ మనిపించారు.గిర్ అడవుల్లో చాలా సింహాలు ఉండడంతో కొన్ని దారి తప్పి ఇలా జనావాసాల్లోకి వస్తున్నట్లుగా భావిస్తున్నారు.







