అదేంటి ఏప్రిల్ లోనే సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అయిపొయింది కదా అని అనుకుంటున్నారా ? నిజమే ఏప్రిల్ ఎనిమిది న విడుదల అయిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా చ్సెఇ అంచనాలు అందుకోలేక విఫలం అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడింది.మొదటి రోజు ముప్పు కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది కూడా.
తరవాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్ గా నిలిచిన ఈ చిత్రం వంద రోజుల తరవాత బుల్లితెర మీద రాబోతోంది.
ఈ నెల 17 న ఆదివారం పవన్ కళ్యాణ్ సర్దార్ టీవీ లో మొదటి ప్రిమియర్ షో వేస్తున్నారు.
సర్దార్ గబ్బర్ సింగ్ మీద పెట్టిన పెట్టుబడి పోల్చుకుంటే సినిమా డిజాస్టర్ అయ్యింది కానీ, సినిమా మరీ తీసిపారేయదగ్గదేమీ కాదు.అంచనాలు మరీ పెరిగిపోవడం.
వాటిని అందుకోవడంలో ఈ సినిమా విఫలమవడంతో సినిమాకు అలాంటి ఫలితం వచ్చింది.ప్రథమార్ధం వరకు బాగానే ఉంటుంది.
ద్వితీయార్ధం విషయంలోనే తేడా కొట్టేయడంతోనే సినిమా అలా తయారైంది.ఐతే టీవీల్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు మంచి ఆదరణే ఉంటుందని భావిస్తున్నారు.
ఈ సినిమాకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశాలున్నాయి.







