వచ్చే నెలలో రాబోతున్న దసరా పండుగ కి మెగాస్టార్ చిరంజీవి తన గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
అదే సమయం లో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా తన ది ఘోస్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు.అందుకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.అక్టోబర్ 5వ తారీఖున ఈ సినిమాలు భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్నాయి.
ఈ సమయంలోనే బెల్లంకొండ సాయి గణేష్ నటించిన స్వాతి ముత్యం సినిమా కూడా విడుదలకు సిద్ధం అయింది.రెండు పెద్ద సినిమా లతో పాటు విడుదల చేయాలంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉండాలి.
ఆ స్థాయి కంటెంట్ స్వాతిముత్యం సినిమా లో ఉందా అంటూ ఇప్పుడు కొందరు చర్చించుతున్నారు.
బెల్లంకొండ సాయి గణేష్ కి ఇది మొదటి సినిమా అయినా కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా అక్టోబర్ 5వ తారీఖునే ఆ రెండు సినిమా లతో పాటు దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించడం వారికి సినిమా పై ఉన్న నమ్మకం ను తెలియజేస్తుంది.
స్వాతిముత్యం సినిమా టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉంది.తప్పకుండా సినిమా పాజిటివ్ బజ్ ని దక్కించుకుంటుందని అంతా భావిస్తున్నారు.

కానీ ఈ సమయంలో వారు విడుదల చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కంటెంట్ ఎంత సూపర్ గా ఉన్నా కూడా కొత్త హీరో సినిమాను ఇద్దరు సూపర్ స్టార్లతో విడుదల చేయడం కరెక్ట్ కాదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమాను సాధ్యం అయినంత ఎక్కువగా ప్రమోట్ చేసి వదలబోతున్నారు.ఈ సినిమా లో గణేష్ కి జోడీగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.