కాశీ సంకట మోచన్ మందిరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి నిరంతరం రామనామ స్మరణలో ఉంటాడు.కేసరి.

 Do You Know The Kashi Sankata Vimochan Mandir Kashi Sankata Vimochan Mandir, De-TeluguStop.com

అంజనా దేవిల పుత్రుడైన హనుమాన్ సీతాదేవి అన్వేషణలో లంకకు వెళ్లి ఆమె ఆచూకీ కనుగొంటాడు.అనంతరం శ్రీరాముడు వానరుల సాయంతో రావణాసురుడిని వధించడంతో సీతమ్మకు చెర వీడుతుంది.

హనుమాన్ చిరంజీవి.ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

భారత దేశంలో వేలాది హనుమాన్ మందిరాలు ఉన్నాయి.వీటిలో వారణాసిలోని సంకట్ మోచన్ మందిరం ప్రముఖ దేవాలయంగా ఖ్యాతి గడించింది.

హనుమాన్ ప్రత్యక్షమైన ప్రదేశంలో… 

రామ చంద్రుని చరితాన్ని రాసిన కవుల్లో తులసీదాస్ అగ్రగణ్యులు.ఆయన రాసిన రామచరిత మానస్ మహాగ్రంథం.

వారణాసిలోని అస్సి నదీ తీరంలో తులసీదాసు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం వెల్లడిస్తోంది.అంజనీ పుత్రుడి ఆశీస్సులతోనే ఈ పుస్తకాన్ని రచించినట్టు చరిత్ర కారులు పేర్కొంటారు.

శని ప్రభావం నుంచి రామ భక్తులను హనుమాన్ రక్షిస్తాడని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.రామ భక్తుడైన స్వామిని పూజిస్తే అన్ని శుభాలు చేకూరుతాయి అని అనంతకోటి భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని నూతన విశ్వనాధుని మందిర సమీపంలో హనుమాన్ ఆలయం ఉండటం విశేషం.సంకటం అంటే కష్టాలు.

మోచనకు అర్ధం విముక్తి కలిగించడం.కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు కనుకే ఆంజనేయ స్వామిని సంకట్ మోచన్ హనుమాన్ గా కొలుస్తారు.

మంగళ, శనివారాల్లో భక్తులు వేలాదిగా ఆలయానికి తరలి వస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube