సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి.అయితే నవగ్రహాలను పూజించేవారు నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేయడం మనకు తెలిసిన విషయమే.
కానీ మన జాతక దోషాలు రీత్యా కొన్నిసార్లు ఒక్కో గ్రహానికి పూజలు చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా పూజలు చేసినప్పుడు దోష పరిహారం అవుతుంది.
అయితే ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం…
నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు కనుక ముందుగా సూర్యునికి పది ప్రదక్షిణలు చేయాలి.ఈ విధంగా సూర్యుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
కీర్తి ప్రతిష్టలను పొందాలనుకునేవారు చంద్రుడి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి.బుద్ధి వికాసం కోసం, సిరి సంపదలు కోసం మనం అంగారకుడికి ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా అంగారకుడి చుట్టూ 5,12,23 ప్రదక్షిణలు చేయటంవల్ల అంగారకుడి అనుగ్రహం మనపై ఉంటుంది.
గౌరవ ప్రతిష్టల కోసం గురుడు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.గురు గ్రహానికి 3 లేదా 12 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.ఇక శుక్రగ్రహం ఆకర్షించే గ్రహం కనుక శుక్ర గ్రహానికి 6 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
శని దోషాలు లేకుండా ఆనందమైన జీవితం కోసం శని గ్రహానికి 8 ప్రదక్షిణలు చేయాలి.ధైర్య సాహసాలను పెంపొందించుకోవడం కోసం రాహుగ్రహానికి నాలుగు సార్లు ప్రదక్షణ చేయాలి.
అదే విధంగా మనకు వంశాభివృద్ధి కలగాలంటే కేతు గ్రహానికి తొమ్మిది ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేవారు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే… ముందుగా ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోని స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల ప్రదక్షిణలు చేసి ఇంటికి వెళ్ళాలి.ఇంటికి వెళ్లగానే బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళకూడదు.ఈ విధంగా చేసినప్పుడే గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.