విండోస్‌లో లోపాన్ని పసిగట్టిన యూఎస్ నిఘా సంస్థ: రంగంలోకి దిగిన మైక్రోసాఫ్ట్

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక తీవ్రమైన లోపాన్ని కనుగొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ దానికి భద్రతాపరమైన పరిష్కారాన్ని కనుగొంది.

విండోస్‌లో ఉన్న ఈ లోపం డేటాను ప్రామాణీకరించడానికి, భద్రపరిచేందుకు ఉపయోగించే డిజిటల్ సర్టిఫికెట్లను నకిలీగా మార్చేందుకు హ్యాకర్లకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది.

ఈ లోపం ఉన్న విండోస్ సిస్టమ్స్ వినియోగదారులకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ లోపాన్ని ఉపయోగించుకుని ఇప్పటి వరకు ఎవరూ ఎటువంటి దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా ఎన్ఎస్ఏ సైతం ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది.అయితే వీలైనంత త్వరగా విండోస్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్న వారంతా దానిని అప్‌డేట్ చేసుకోవాలని ఎన్ఎస్ఏ, మైక్రోసాఫ్ట్ రెండూ కోరాయి.ఇందుకోసం క్లాసిఫైడ్ నెట్‌వర్క్ ఆపరేటర్లను ఇప్పటికే ఆదేశించామని, త్వరలోనే అప్‌డేట్‌ వర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఏ అధికారి న్యూబెర్గర్ విజ్ఞప్తి చేశారు.

మైక్రోసాఫ్ట్ ప్యాచ్ సెక్యూరిటీని వేగంగా అప్‌డేట్ చేసిన సంస్థగా ఎన్ఎస్ఏ నిలిచింది.సదరు ఏజెన్సీ గతంలో తమ ఉత్పత్తులలోని లోపాలను గుర్తించి కంపెనీలను అప్రమత్తం చేసినట్లు తెలిపింది.ఇన్‌ఫార్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ కమ్యూనిటీతో కలిసి తాము మరింత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని న్యూబెర్గర్ తెలిపారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు