ఈవస్తువులు మీ ఇంట్లో ఉంటే… లక్ష్మి దేవి మీ ఇంటికి నడిచి వస్తుంది

మన పురాణాల ప్రకారం లక్ష్మి పూజ చేసి లక్ష్మి దేవికి స్వాగతం పలకటం మరియు లక్ష్మి స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి.తెల్లని వస్త్రం పరచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చేమంతి పూలతో పూజిస్తే మంచిది.

 Lakshmi Devi Kataksham Secrets-TeluguStop.com

అలాగే గులాబీ,తామర పువ్వు,మల్లెలు,సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది.అమ్మవారికి ఇష్టమైన తెలుగు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి.

లక్ష్మి దేవిని పైన చెప్పిన ఏ పువ్వులతోనైనా అష్టోత్తరం చేసి తీపి పదార్ధాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలు చేకూరుతాయి.

వ్యాపారం చేసే వారు తమ షాప్ లలో తప్పనిసరిగా లక్ష్మి దేవి పూజ చేస్తారు.

ఇలా చేస్తే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకం.మన ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మి దేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పూజ గదిలో ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు ఉన్న బంగారు లేదా వెండి నాణేలను ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది.

పూజ గదిలో నెమ‌లి ఫించాన్ని ఉంచితే లక్ష్మి దేవి అనుగ్రహం లభించటమే కాకుండా ఇంటిలోని నెగిటివ్ శక్తి బయటకు పోయి పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటుంది.పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటే మనం చేసే పనులు విజయవంతం అవుతాయి.

తామర పువ్వుపై కూర్చొనే లక్ష్మి దేవికి తామ‌ర పుష్పాలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube