హైదరాబాద్:డిసెంబర్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ: మంత్రి కేటీఆర్

భార‌త‌దేశం మొత్తం గ‌ర్వ‌ప‌డేలా, బావితరాలు స్ఫూర్తి పొందేలా 150 కోట్ల రూపాయలతో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం,11ఎకరాల ప్రాంగణంలోమ్యూజియం, జ్ఞానమందిరం ఏర్పాటు చేస్తున్నామని,ఇది భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలవ‌బోతుందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

హైదరాబాద్ నగరంలో పివి మార్గ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనుల పురోగతిని, విగ్రహ నమూనా ను మంత్రులు కేటీఆర్ , కొప్పుల ఈశ్వర్ తో పాటు పలువురు ఎమ్మెల్యే లు పరిశీలించారు.

అనంతరంహైదరాబాద్ లో నిర్వహించిన భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్ పథకం కింద బెస్ట్ పెరఫార్మింగ్ ఎంటర్‌ప్రైజ్ అవార్డులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా పీవీ మార్గ్‌లో 125 అడుగుల అంబేద్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు.రాష్ట్ర ప్రజలు గర్వించే విధంగా సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచనలకు అనుగుణంగాఅద్భుతమైన స్ఫూర్తి కేంద్రంగాతీర్చిదిద్దుతాం అన్నారు.

జీవితంలో ఒక్కసారే ఏర్పాటు చేసే బృహత్కార్యం ఇదని అన్నారు.డిసెంబ‌ర్ చివ‌రి నాటికి ఈ విగ్ర‌హాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్క‌రించ‌బోతోంద‌న్నారు.

Advertisement

అంబేద్క‌ర్ త‌త్వాన్ని మాటల్లో చాలా మంది చెప్తారు.కానీ ఆ త‌త్వాన్ని కేసీఆర్ ఆక‌ళింపు చేసుకుని ముందుకు సాగుతున్నారన్నారు.

అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్య‌మైంద‌న్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ మ‌హానుభావుడు అంబేద్క‌రే కార‌ణ‌మ‌ని కేటీఆర్ చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధికి ఎవరువిఘాతం కలిగిస్తే సహించేది లేదని,ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నాచేశారు.అంబేద్కర్ ఆలోచలు అమలు కావాలని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు