ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివితో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాలు కాగా సెన్సార్ పూర్తైన తర్వాత నిడివిని 3 గంటల 2 నిమిషాలకు తగ్గించారు.
అయితే ఈ సినిమాలో చాలా సీన్లను కట్ చేశారని తెలుస్తోంది.ఈ సినిమాలో మల్లి, భీమ్ పాత్రల మధ్య అనుబంధాన్ని సరిగ్గా చూపించలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే మల్లికి సంబంధించిన చాలా సన్నివేశాలు సినిమా ఎడిటింగ్ లో పోయాయని సమాచారం.ఈ సన్నివేశాలు సినిమాలో ఉండి ఉంటే సినిమాలో భీమ్ రోల్ మరింత బలంగా ఎస్టాబ్లిష్ అయ్యేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ కాంబో సీన్లు కూడా కట్ అయ్యాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.అయితే జక్కన్న స్పందిస్తే మాత్రమే డిలీట్ అయిన సీన్లకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
![Telugu Ajay Devgan, Alia Bhatt, Bheem Character, Jr Nt, Olivia Morris, Rajamouli Telugu Ajay Devgan, Alia Bhatt, Bheem Character, Jr Nt, Olivia Morris, Rajamouli](https://telugustop.com/wp-content/uploads/2022/04/rrr-movie-bheem-character-ram-charan-rajamouli.jpg)
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాత్ర విషయంలో చూసింది నిజం కాదని మల్లి, తారక్ కాంబో సీన్లు సినిమాలో ఉండి ఉంటే అద్భుతంగా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఎన్టీఆర్ భీమ్ రోల్ లో చరణ్ రామరాజు రోల్ లో తమకోసమే ఆ పాత్రలు పుట్టాయేమో అనేంత అద్భుతంగా నటించారనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్, చరణ్ కాంబోలో ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
![Telugu Ajay Devgan, Alia Bhatt, Bheem Character, Jr Nt, Olivia Morris, Rajamouli Telugu Ajay Devgan, Alia Bhatt, Bheem Character, Jr Nt, Olivia Morris, Rajamouli](https://telugustop.com/wp-content/uploads/2022/04/ram-charan-rajamouli-alia-bhatt-Olivia-Morris-ajay-devgan.jpg)
ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.సీక్వెల్ లో రామరాజు, భీమ్ పాత్రలను మరింత పవర్ ఫుల్ గా చూపించే అవకాశం అయితే ఉంది.రాజమౌళి మహేష్ సినిమాను పూర్తి చేసిన తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ఆలోచించే అవకాశాలు ఉంటాయి.
ఎన్టీఆర్, చరణ్ భవిష్యత్తు సినిమాలతో విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.