ఆ ఆలయంలో పది వేల మంది నగ్నంగా పూజలు... ఎందుకంటే...?

నగ్నంగా దేవుడికి పూజలు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.? వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఒక ఆలయంలో మాత్రం ఒకరు కాదు.

ఇద్దరు కాదు.

ఏకంగా 10,000 మంది దేవుడికి నగ్న పూజలు చేస్తారు.ఈ పూజలు చేసేది మన దేశం లో మాత్రం కాదులెండి.

జపాన్ లోని ఒక ఆలయంలో ఒకే సమయంలో 10,000 మంది భక్తులు పూజలు చేస్తారు.ఈ పూజల్లో కేవలం పురుష భక్తులు మాత్రమే పాల్గొనాలి.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జపాన్ లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతాయి.పూర్తి వివరాలలోకి వెళితే జపాన్ లోని ఒకాయమా ప్రాంతంలో సాయిదైజి కన్నోనిన్ అనే ఒక ఆలయం ఉంది.

Advertisement
10 Thousand Men Gather Inside Japanese Temple For Special Pooja-ఆ ఆలయ�

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన 10 గంటలకు పురుషులంతా నగ్నంగా ఆలయంలో ప్రవేశించి పూజలు చేస్తారు.నేకుడ్ ఫేస్టివల్ అని పిలవబడే ఈ పండుగలో దుంగను దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.

10 Thousand Men Gather Inside Japanese Temple For Special Pooja

ఈ పూజలకు పూర్తి నగ్నంగా హాజరు కావాల్సిన అవసరం లేదు.తెల్లని గోచీలు కట్టుకొని, తక్కువ మొత్తంలో దుస్తులు వేసుకొని కూడా ఈ ఆలయంలో ప్రవేశించవచ్చు.కేవలం పది వేల మందికి మాత్రమే ఆలయం లోపలికి ప్రవేశం ఉంటుంది.

ఆలయంలో మొదట ప్రవేశించే పది వేల మంది అదృష్టవంతులని అక్కడి భక్తులు నమ్మడంతో పాటు పూజారులు విసిరే 100 కర్ర ముక్కలు ఎవరికైతే లభిస్తాయో వారికి దేవుని కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.జపాన్ లోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి వేడుకలు జరుగుతాయి.

హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు