మహారాష్ట్ర లో అగ్ని ప్రమాదం 10  మంది నవజాతి శిశువుల మృతి..!!

దేశంలో మహారాష్ట్ర రాష్ట్రాన్ని దరిద్రం ఇంకా వదిలి పెట్టినట్టు లేదు.

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ దేశంలో ఎంటరైన సమయంలో ఈ రాష్ట్రం పైనే ఎక్కువగా ప్రభావం చూపటం అందరికీ తెలిసిందే.

తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బండారం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన ఈ ఘటనలో అభం శుభం తెలియని 10 మంది నవజాతి శిశువుల మరణించటంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

చనిపోయిన శిశువులు వయసు ఒక నెల నుండి మూడు నెలల మధ్య ఉండటంతో ఈ ఘటన చాలా మందిని కలిచి వేసింది.అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 17 మంది శిశువులు ఐసీయూలో ఉండగా ఏడుగురిని వైద్య సిబ్బంది రక్షించ కలిగారు.

అసలు ప్రమాదానికి గల కారణం ఏంటో ఇంకా తెలియలేదు.దేశవ్యాప్తంగా చాలా మందిని ఈ ఘటన కలిచి వేయటంతో పాటు జాతీయ మీడియాలో హైలెట్ అవటంతో మోడీ ఘటనపై ఆరా తీసి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.

Advertisement

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదే విధంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే .ఘటన ఎందువల్ల జరిగింది అనే దానిపై ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ని అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు.ఇదే క్రమంలో విచారణ చేయాలని స్థానిక ఎస్పీని కూడా ఆదేశించారు.

ఇదిలా ఉంటే మృతిచెందిన చిన్నారుల కుటుంబానికి ఒక్కొక్క లకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.  .

ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను...స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు