ఐఆర్ఆర్ కేసులో అధికారిని మార్చడం వెనుక కుట్ర..: ధూళిపాళ్ల

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణాధికారిని మార్చడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.

ఐఆర్ఆర్ కేసులో దర్యాప్తు అధికారి ఏఎస్పీ జయరాజును ఎందుకు మార్చారని ధూళిపాళ్ల ప్రశ్నించారు.డీఎస్పీ స్థాయి అధికారి విజయ్ భాస్కర్ ను ఎందుకు నియమించారో చెప్పాలన్నారు.

Conspiracy Behind Transfer Of Officer In IRR Case: Dhulipalla-ఐఆర్ఆర

ఏఎస్పీ స్థాయి అధికారి జయరాజు ప్రభుత్వం మాట వినడం లేదా అని నిలదీశారు.విచారణ కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వొద్దని చెప్పే ప్రభుత్వం ఈ దశలో విచారణాధికారిని ఎలా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Advertisement
విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?

తాజా వార్తలు