ఏడు శనివారాలు శ్రీవారిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి

మన సంస్కృతిలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది.ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తాం.

ఆపదలమెక్కువాడు వెంకటేశ్వర స్వామిని శనివారం పూజిస్తాం.సప్త గిరులపై వెలసిన ఆ ఏడుకొండలవాడు మనల్ని ఆపదల నుండి రక్షిస్తాడు.

అలాగే కోరిన వరాలను ప్రసాదిస్తారు.శనీశ్వరుడు మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించాలి.

ఎలా పూజించాలో వివరంగా తెలుసుకుందాం.

Advertisement
Sri Venkateswara Swamis Seven Saturdays Vratham-ఏడు శనివారా
Sri Venkateswara Swamis Seven Saturdays Vratham

శనివారం తెల్లవారు జామునే లేచి తలస్నానము చేసి పూజగదిని అందంగా అలంకరించాలి.పూజ ప్రారంభం చేసి సంకల్పం చెప్పుకోవాలి.బియ్యపుపిండిలో పాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిద తయారుచేసుకోవాలి.

ఆ ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి.వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున ఇలా చేస్తే స్వామి వారి కృప కలగటమే శని బాధ కూడా తొలగిపోతుంది.

అలాగే తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు రావటమే కాకుండా లక్ష్మి దేవి ఆ ఇంటిలో కొలువై ఉంటుంది.శనివారం సాయంత్రం వేంకటేశ్వర ఆలయంలో ఆవు నేయితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.

ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరుగుతాయి.

విద్యార్ధులకు కెనడా శుభవార్త.. 40 వేల కొత్త అవకాశాలు సిద్ధం
Advertisement

తాజా వార్తలు