మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎలాంటి విజయాన్ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేశాడు చెర్రీ.
రంగస్థలం సినిమా సాధించిన విజయానికి అది జాతీయ అవార్డును సైతం అందుకుంది.ఇలాంటి క్లాసిక్ హిట్ మూవీని ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
అయితే అందులో తమిళ రీమేక్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది.
స్టార్ డైరెక్టర్ కమ్ నటుడు రాఘవ లారెన్స్ రంగస్థలం రీమేక్ హక్కులను భారీ మొత్తానికి చేజిక్కించుకున్నాడు.
ఇక ఈ సినిమాను వేరే డైరెక్టర్‌తో డైరెక్ట్ చేయించాలని లారెన్స్ చూస్తున్నాడు.కాగా లింగుస్వామి అయితే ఈ సినిమాను బాగా తెరకెక్కిస్తాడని భావించిన లారెన్స్ దీనికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టాడు.
లారెన్స్, లింగుస్వామిల కాంబినేషన్ అంటేనే ఊరమాస్ కాంబో అని పేరుంది.దీంతో రంగస్థలం సినిమాను వీరు ఎలా రీమేక్ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.
సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ సాధించింది.ఒక పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్కు అందరూ ఫదా అయిన విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది.మరి లారెన్స్ తీయబోయే రీమేక్‌లో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తాడో చూడాలి.