జాతి వైరం మరిచి ఏనుగు పిల్ల, జీబ్రా పిల్ల స్నేహం

ఏదైనా రెండు విభిన్న జాతులకు సంబంధించి రెండు జంతువులు స్నేహం చేస్తుంటే కొంచెం చూడముచ్చటగా ఉంటుంది.

సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చక్కటి వీడియోలు మన ఫోన్లలో ప్రత్యక్షం అవుతున్నాయి.

ఎప్పుడూ ఆకలితో పిల్లి ఆరాటం, ప్రాణ సంకటంతో పారిపోయి ఎలుక పోరాటం వంటివి గమనిస్తుంటాం.అయితే అవి రెండూ కలిసి ఉంటే కొంచెం ప్రత్యేకత ఉన్నట్లే.

పిల్లి - కుక్క, చిలక - కుక్క ఇలా ఎన్నో కాంబినేషన్లు చూడగానే మనకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది.ఇలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ పిల్ల ఏనుగు, పిల్ల జీబ్రా కలిసి స్నేహంగా ఉంటున్న తీరు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Advertisement

ట్విట్టర్‌లో యోగ్ అనే ఖాతాలో ఓ వీడియోను ఇటీవల పోస్ట్ చేశారు.అందులో ఓ ఏనుగు పిల్ల, ఓ జీబ్రా పిల్లతో స్నేహం చేయడం ఆసక్తికరంగా ఉంది.

ఆ ఏనుగు తన తొండంతో ఆ జీబ్రాను కౌగలించుకోవడం భలేగా ఉంది.రెండూ వేర్వేరు జాతులకు చెందినవైనా ఆ స్నేహం చూస్తే అలా అనిపించడం లేదు.

అవి ఎంతో అన్యోన్యంగా జాతి వైరం మరిచి కలిసి మెలిసి జీవిస్తున్నాయి.ఆ రెంటింటి స్నేహం మనకు ఎన్నో సందేశాలను ఇస్తోంది.

ప్రస్తుతం ఏ ఇద్దరు మనుషులు చూసినా కలిసి మెలిసి ఉండలేకపోతున్నారు.ఏవో కొన్ని విభేదాలు వారి మధ్య కనిపిస్తున్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

కాసేపు కూడా కలిసి మెలిసి ఉండలేక గొడవలు పెట్టుకుంటూ కనిపిస్తున్నారు.ఇలాంటి వారికి ఈ జీబ్రా-ఏనుగు స్నేహం కనువిప్పు అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు